సాంస్కృతిక సంఘాలు-బందరు

బందరులోని సాంస్కృతిక సంఘాలు

1. బందరు బంధువులు 

2. గుడిపూడి రాధికారాణి 







2. గుడిపూడి రాధికారాణి - నవరత్న మహిళా పురస్కారం 


ప్రముఖ రచయిత్రి రాధికారాణి గారికి నవరత్న మహిళా పురస్కారం

మచిలీపట్నం- కల్చరల్ వార్త: బందరు పట్నానికి చెందిన ప్రముఖ రచయిత్రి గుడిపూడి రాధికారాణి నవరత్న మహిళా పురస్కారానికి ఎంపిక అయ్యారు. బాల సాహిత్యం విభాగంలో రాధికారాణికి ఈ పురస్కారం లభించినది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొమ్మిది రంగాల్లోని ప్రముఖులకు  నవరత్న మహిళా పురస్కారాలను, జివిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ సంస్థ ప్రకటించినది. బాలసాహిత్యంలో వైవిధ్యమైన పేర్లతో నీతి కథలు వ్రాసిన రాధికారాణిని ఎంపిక చేసారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు(08-03 -2017), హైదరాబాదు త్యాగరాయ జ్ఞాన సభలో జివిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ వారు నిర్వహించే కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారం అందుకోనున్నారు. బాలసాహిత్యంలో 25కు పైగా పురస్కారాలు అందుకున్న రాధికారాణి మంచి వ్యాసకర్తగా, వక్తగా, సాహితీ విమర్సకురాలిగా, కవయిత్రిగా అందరికీ సుపరిచితులు. వ్యాసాలూ, గజల్స్, సమీక్షలు వ్రాశారు. పత్రికలలో వీరి రచనలు ప్రచురితమవుతున్నాయి. ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఈమే కవితలు ప్రసారమవుతాయి. కృష్ణాజిల్లా బంటుమిల్లిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా పని చేస్తూనే ఈ రచనావ్యాసంగంలోనూ రాణిస్తున్నారు. నవరత్న మహిళా పురస్కారానికి ఎంపికైన రాధికారాణిని, బందరు పట్టణానికి చెందిన సాహిత్య, సాంస్కృతిక  సంస్థల ప్రతినిధులు అభినందించారు. 


మా అభిమాన రచయిత్రి వార్తను ఆదివారం (05-03-2017) తెలుగు దినపత్రికలలో ప్రచురించి సహకరించారు. అందరికీ మా telugu9.in తరపున కృతజ్ఞతాపూర్వక వందనములు.  
ఆయా పత్రికా వార్తలను వీక్షించండి. 


----------------------------------------  PAGE  BREAK  --------------------------------------------


----------------------------------------  PAGE  BREAK  --------------------------------------------
 ----------------------------------------  PAGE  BREAK  --------------------------------------------




Popular Posts