ప్రకృతి వ్యవసాయం -1

1. ప్రకృతి వ్యవసాయ సదస్సు, కోరుకొల్లు కలిదిండి (మం) 

17 -12 -2016 శనివారం నాడు కోరుకొల్లు గ్రామం (కలిదిండి మండలం, కృష్ణా జిల్లా)లో ప్రకృతివ్యవసాయం గురించి ఒక అవగాహనా సదస్సు జరిగినది. ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు శ్రీ ఎమ్. విజయరామ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందే 5గురు రైతులు శ్రీ నంబూరి విజయనరసింహరాజు గారి నాయకత్వంలో ఒక జట్టుగా ఏర్పడి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. దానితో వారు సంతృప్తి చెందిన తరువాత, ఆప్రాంత రైతులందరికీ తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ అవగాహనా సదస్సు ఏర్పాటు చేసారు. సదస్సు జరిగే నేటికి మరొక 5గురు రైతులు కొత్తగా వచ్చి వీరితో జతకట్టారు. మొత్తం 10 మంది అయ్యేసరికి విజయరామ్ గారు చాల సంతోషించారు. వారందరినీ వరుసలో నిలబెట్టి ప్రత్యేకంగా అభినందించారు. తరువాత సభకు వచ్చిన అందరిచే ప్రమాణం చేయించారు ఈవిధంగా – 1) నాయింటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకొని వర్షపు నీటిని, భూగర్భ జలాలను కాపాడుకొంటానని, 2) పాలిథిన్ సంచి ఇక వాడనని చేతి సంచితో బజారుకు వెళతానని నేలతల్లికి మాట ఇస్తున్నానని, ౩) ప్రకృతి వ్యవసాయోత్పత్తులతోనే జీవనం సాగించి ఆరోగ్యం కాపాడుకొంటానని 4) నా చుట్టూ పరిసరాల పరిశుభ్రతను కాపాడుతానని - ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే మనం చేయవలసిన మంచిపనులు చాలానే ఉన్నవి- అన్నివిషయాలలోనూ ధర్మవర్తన కలిగివుండాలి, పట్టువిడుపులు పాటించి సమయానుకూలంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలి, అందరినీ సమదృష్టితో చూడాలి, తోటివారిని ఆదుకోవాలి. వృద్దులను కాపాడుకోవాలి, నిధానమే ప్రధానం అన్నారు, వేచిచూస్తే ఏదోఒక మార్గం లభించకపోదు. మంచి మార్గాలేప్పుడు మనచుట్టునే ఉంటాయి అదను చూచి వెదికి పట్టుకోవాలి. మన సమస్యలన్నీ తీరిపోతాయి.

















సభకు వచ్చిన పెద్దలు- కలిదిండి మార్కెటింగ్ చైర్మన్ శ్రీ నంబూరి వెంకటరామరాజు గారు, 
కైకలూరు ఎ.డి.ఎ.నుంచి శ్రీ సుబ్రహ్మణ్యంగారు,
Dr.పెన్మచ్చ బలరామ ప్రతాప్ కుమార్ గారు (ఆకివీడు),
శ్రీ గండికోట వెంకటేశ్వరరావుగారు,  
Ex. DSP. శ్రీ చెన్నంశెట్టి చక్రపాణిగారు ఇంకా గ్రామాధికారులు విచ్చేసి తమతమ ఆశీర్వచనాలతో సభికులలో ఉత్సాహం నింపారు.

విజయరామ్ గారి ముఖ్య అనుచరులిద్దరు- శ్రీ M.L. గణేశ్ గారు, శ్రీ తిరుపతిగారు - వారి గురించిన మాచారం వారి ఫోటోలలోనే వున్నది చూడగలరు. విజయరామ్ చెప్పిన సమాచారమంతా తరువాత ప్రచురిస్తాము. 
  
ప్రకృతి వ్యవసాయం చేయబూనిన రైతులు – 
1) శ్రీ నంబూరి విజయనరసింహరాజు,
2) శ్రీ నరహరిశెట్టి శ్రీరామకృష్ణ
3) శ్రీ తిరుమాని వేంకటేశ్వరరావు
4) శ్రీ మట్టా రాజేంద్ర
5) శ్రీ పోనసానిపల్లి గుప్త
6) శ్రీ మూడెడ్ల ఉమామహేశ్వరరావు
7) శ్రీ తిరుమాని వేంకటేశ్వరరావు
8) శ్రీ అంకెం శ్రీనివాసరావు
9) శ్రీ అంకెం సోమయ్య
10) శ్రీ నామన రమేష్ 
నిర్వాహకులు - సభికులందరికీ మధ్యాహ్నం, మంచి భోజనం అందించారు. చాలా Thanks. సభకు వేచ్చేసిన పురప్రముఖులు, పెద్దలు, ప్రజలు అందరికీ పేరుపేరునా నమస్కారములు. ముందు ముందు ఇదే సంఘిభావము, కార్యదక్షతతో గ్రామం ముందుకు పోవాలని వేరోకరికి ఆదర్శంగా నిలవాలని కోరుచున్నాము. అభ్యంతరాలుంటే తొలగిస్తాము. సవరణలున్నా, మార్పులు చేర్పులు కావలసినా, మాకు తెలియచేయండి. ఈ సమాచారమంతా, మా www.telugu9.in అనే వెబ్ సైట్ లో ఉన్నది. దేశ విదేశాలలో నున్న అందరూ మీ విషయాలు తెలుసుకొనే అవకాశం లభించినట్లయింది.

మా అడ్రసు: వెనిగళ్ళ వెంకట మహేశ్వరరావు (విజయరామ్ గారి స్నేహితుడు)
తెలుగు9.ఇన్
www.telugu9.in
E-mail: telugu9.in@gmail.com
Cell: 8331858117.                 

Popular Posts