వచనకవి " రాజా చౌదరి"
వచనకవి " రాజా చౌదరి"గా పిలువబడుచున్న శ్రీ గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్.
శ్రీ గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్ గారు, కృష్ణాజిల్లా వాసి అయినా ప్రస్తుతం హైదరాబాదులో, ఒక ప్రైవేట్ కంపెనిలో ఉంటున్నారు. అయితే ప్రవృత్తిగా రచనా వ్యాసంగాన్ని చేపట్టి, కొన్ని వందల కవితలు వ్రాసి పుస్తక రూపంలో తెచ్చారు. కవితలు వ్రాయటమే గాకుండా, స్వయంగా తానే పాడి ప్రసిద్ధిగాంచారు. తనపాటలతో ఒక ఆల్బం కూడా విడుదల చేయబోతున్నారు.
మిత్రులతో కలిసి నిరుపేదలైన వయోవృద్ధులకు సహాయపడుతూ సమాజ సేవలలోను గణుతికేక్కారు.
సంక్రాతి సందర్భంగా వారు వ్రాసిన ఒక కవితను ఇక్కడ ఇస్తున్నాము.
శ్రీ శ్రీ కళావేదిక వారిచ్చిన ప్రశంసాపత్రంతో - రాజా చౌదరిగారు .
"రాజా చౌదరి" గా పిలువ బడుచున్న శ్రీ గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్ బయోడేటా చుస్తే, వారు చేస్తున్న కృషికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చును.
బయో డేటా
పేరు : రాజేంద్ర ప్రసాదు
ఇంటి పేరు : గరిమెళ్ళ
కలం పేరు : గరిమెళ్ళ గమనాలు
Facebook ID : గరిమెళ్ళ గమనాలు
అమ్మ పేరు : పద్మావతి
నాన్న పేరు : కీ//శే// సాంబ శివరావు
భార్య పేరు : శ్రీ పద్మ
పుట్టిన తేది : 01. 10. 1984
స్వస్థలం : కేసరపల్లి , కృష్ణా జిల్లా , ఆంధ్ర ప్రదేశ్
ప్రస్థుత నివాసం : భాగ్య నగరం (హైదరాబాద్) , తెలంగాణ.
QUALIFICATION: MBA (Finance)
వృత్తి : Working as Asst.Manager in Pvt.company
ప్రవృత్తి : కవితలు మరియు పాటలు రాయటం
ఈ మధ్యనే కధలు కూడ మొదలెట్టాను
My blog name : http://garimellagamanalu.blogspot.in
My mail id : rpgarimella009@gmail.com and
My Contact Nos : 9705793187 & 9533866637
కవితా ప్రస్థానం :
చిన్నతనం నుంచే నాకు కధలు ,కవితలు ,పాటలు పై మక్కువ ఎక్కువ .
వాటిని ఆచరణలో పెట్టింది మాత్రం ఇంటర్మీడియట్ నుంచి .
నేను కవిగా పరిచయం అయ్యింది మాత్రం మన ఫేస్ బుక్ ద్వారానే .
- ''మన తెలుగు మన సంస్కృతి '' మరియు ''సాహితీ సేవ '' మరియు ''కృష్ణా తరంగాలు'' గ్రూప్ లలో జరిగిన కవితా పోటీలలో మరియు
- ప్రపంచతెలుగు కవితోత్సవం గిన్నీస్ రికార్డ్ కొన్ని ప్రశంసా పత్రాలను & సత్కారాలను అందుకోవటం జరిగింది . అలాగే ''అచ్చంగా తెలుగు '' ,
''మన తెలుగు టైమ్స్ '' kuwaitnris.com ,telugu9.in , www.pratilipi.com లాంటి కొన్ని అంతర్జాల పత్రికలలో నా కవితలు ప్రచురణ పొందినవి .
- మొన్న అక్టోబర్ -2016 లో రాజమహేంద్రవరంలో శ్రీ శ్రీ కళావేదిక తరపున నుంచి శ్రీ శ్రీపురస్కారం పేరిట ''సాహితీ రత్న '' ప్రతిభా అవార్డు ను పొందటం జరిగింది
రెండు సార్లు నేను రాసిన రెండు కవితలు ''ఆంధ్రజ్యోతి '' పత్రికలో లో రావటం జరిగింది
అలానే ''మ్యూజిక్ వరల్డ్ '' ద్వారా నేను రాసిన పాట etv 2 కి సెలక్ట్ అయ్యి
''SHORT FILM '' కి ఉపయోగపడింది . దీని ప్రోత్సాహంతో ఒక పాటను ఆల్బమ్ గా చేసాను
నా కవితలు అనుభవాల నుంచి పుట్టేవి .గుండె లోతుల్లో నుంచి మనసు మాట లా అక్షరమై ముందు కొచ్చేవి
ఇప్పటిదాకా రచించిన కవితలు : సుమారుగా 400 పైన
ఇప్పటిదాకా రచించిన పాటలు : 70 పైన
ఇప్పటిదాకా వ్రాసిన కధలు : 01 మాత్రమే (నిజ జీవితం ఆధారంగా)
ప్రచురణలకు నోచుకున్న కవితలు : మొత్తం 16
ఒక అల్బం మరియు ఒక షార్ట్ ఫిల్మ్ కు సాంగ్ రాయటం జరిగినది
పొందిన ప్రశంసా పత్రాలు : మొత్తం 21
పొందిన బిరుదులు : సాహితీ రత్న
జీవిత లక్ష్యం :
ఒక మంచి కవిగా ,రచయితగా ,వక్తగా పేరు తెచ్చుకోవాలి
నేను రాసిన కవితలతో కవితా సంపుటిలను ప్రచురించాలి
(ఇందుకు సంబంధించి మొదటి నా సంపుటి కోసం ప్రయత్నం జరుగుచున్నది )
నేను రాసిన పాటలతో ఒక్క ఆల్బమ్ అన్నా రిలీజ్ చెయ్యాలి
ఒక్క సినిమాకు అయినా ఒక్క పాట రాసి గేయ రచయిత నవ్వాలి
సన్మానాలు
మచిలీపట్నంలో నిన్న అనగా 08-01-2017 ఆదివారంనాడు జరిగిన "సీనియర్ సిటిజన్ వాణి " మాసపత్రిక వార్షికోత్సవాలలో పాల్గొని సన్మానించ బడిన అభ్యుదయ కవి, గాయకులు, "రాజా చౌదరి" గా పిలువబడే శ్రీ గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్ గారి ఫోటో.
మచిలీపట్నంలో నిన్న అనగా 08-01-2017 ఆదివారంనాడు జరిగిన "సీనియర్ సిటిజన్ వాణి " మాసపత్రిక వార్షికోత్సవాలలో పాల్గొని సన్మానించ బడిన అభ్యుదయ కవి, గాయకులు, "రాజా చౌదరి" గా పిలువబడే
శ్రీ గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్ గారికి ఇచ్చిన ప్రశంసాపత్రం.
శ్రీ రాజా చౌదరి గారి కొత్త కవిత (12-01-2017)
గత సంవత్సరపు -జ్ఞాపకాలు
కొన్ని సంఘటనలు గుర్తుండేవి గుర్తుండి పోయేవి
కొన్ని వాస్తవాలు కదిలించేవి కదిలించి చంపేవి
ప్రతీ మనిషికి విజయం - పరాజయం తప్పదు
ప్రతీ మనిషికి అవమానం - అపమానం అనుభవం తప్పదు
మంచితో పాటు చెడు కూడా వస్తుంది
కష్టం వెమ్మటే సుఖం దాగుంటుంది
ఎంత వేదన చెందినానో అంత ఆనందం పొందినాను
ఎంత అభిమానం పొందినానో అంత అవమానింపబడినాను
జీవితం అంటే బరువు ,బాధ్యతలతో పాటు సర్దుబాటు ఉండాలని
జీవితం అంటే కాయ , కష్టం లతో పాటు కళాపోషణం ఉండాలని
తెలిసింది పాతదే కానీ ఆచరణ కొత్తగా అనిపించింది
అయిన వారు కాని వారై విషాలు కక్కుతుంటే
ఏమీ కాని వారు ఆత్మీయులుగా మారి పలకరించారు
వారి ప్రేమకు నేను సదా నేను బానిసని ........
రాజకీయాలు బయట చూస్తుంటాం కాని
వారి ఎదుగుదలకి మనల్నే ఒక పావులాగా వాడుకుని
మనపైనే రాజకీయ అస్త్ర ప్రయోగం చేయించుకున్నాను
నా నవ్వు అందరికీ తెలుసు .... నా చుట్టూ ఉన్నవారి సంతోషం కోరుకున్నా
నా కోపం మాత్రం కొందరికే తెలుసు కాని అది నన్నే దహించేస్తుంది కానీ మరలా బ్రతికాను
నా నవ్వు అందరికీ తెలుసు .... నా చుట్టూ ఉన్నవారి సంతోషం కోరుకున్నా
నా కోపం మాత్రం కొందరికే తెలుసు కాని అది నన్నే దహించేస్తుంది కానీ మరలా బ్రతికాను
ఎండమావులు చూసాను కానీ నా జీవితంలో పొందే ఫలం చేజార్చుకుని తెలుసుకున్నాను
|
గౌరవించాను గౌరవింపబడ్డాను పాము నిచ్చెన లో పాము కాటుకు బలయ్యాను
తప్పటడుగు వేయలేదు తప్పు అని చెప్పించుకున్నాను
ఒప్పు చేసిన నాడు ఒక్కడూ వచ్చి అభినందించడు
పుట్టిన పుట్టుక గుర్తొస్తుంది మన కష్టాలు గుర్తొస్తే
భవిష్యత్తు వెక్కిరిస్తుంది ఆ కష్టాల కడలిలో ఈది నెగ్గకపోతే
ఎడబాటు చూసాను గ్రహాల పోటు చూసాను
నాకు నేను సరి చేసుకుని తిరిగి పూల బాట వేసుకున్నాను
గమ్మున నా జీవితం సాగిపోతుంది నేడు
గత సృతులు నెమరేసుకుంటూ కొత్త ఆశల్ని గుండె లోతుల్లో దాచుకుంటూ
మారదు ప్రపంచం మారదు ఈ సమాజం
తనవంతు తనకే స్వార్ధపు రెక్కల్ని కట్టుకుంటూ
సొంతవారు అనే భావం కాని , జాలి కాని లేని బంధువర్గాలు
పంతాలకు మాత్రం పుట్టిన ఊరుని , వారి రక్త సంబంధాన్ని కత్తెరతో కత్తిరిస్తారు
రోడ్డున పడే చెత్త కంటే కడుపులో కుళ్లే పాకుడులా పేరుకునే రోజులివి
యదార్ధం కన్నా సొల్లు వాగుడికి విలువిచ్చే సీమ టపాకాయలు
ఏది ఉన్నా , ఎంత ఉన్నా మనోధైర్యం నన్ను ముంచలేదు
తలతిప్పినా , తలవంచని నా మనో సంకల్పం ఓడిపోలేదు
పాత ఆశలపై కొబ్బరి చినుకులు పడినా కొత్తగా పాలపుంతలా మారెను
ఏదో సంశయం వెంటాడుతున్నా నా పై నమ్మకం నాకున్న ఆత్మ స్థైర్యం
ఇది అందరికీ జరిగేవే కానీ నా గత సంవత్సరంలో నా ........ తో ఆడిన నీడక్రీడలు
|
---- 0 ----
అంతర్వేది ప్రాంగణంలో 32 గ//ల పాటు నిర్విరామంగా నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ప్రపంచ తెలుగు కవితోత్సవం లో మన హైదరాబాద్ నుండి కవులను, కవయిత్రులకు గైడ్ గా ఉండి సహకరించినందుకు హైదరాబాద్ నుండి వచ్చిన ప్రముఖ సభ్యులచే మరియు కార్య నిర్వాహకులచే సన్మానింపబడిన సన్నివేశం. అలానే ఆ కవి సమ్మేళనంలో పాల్గొని
4 బుక్ ఆఫ్ రికార్డ్స్ ని తీసుకొనటం జరిగినది .
---- 0 ----
శ్రీ రాజా చౌదరి గారి కొత్త కవిత (18-01-2017)
ఎందుకు కోపాలు ఎందుకు తాపాలు
కాలం మళ్లీ తిరిగీ రాదు కరగని పైత్యాలు అద్భుతమైన అనుబంధాలు ఆత్మీయతల అనురాగాలు ఇన్ని ఉన్నా ఈ లోకంలో ఎగిరెగిరే పంతాల ? //2// కాసేపు ఓపికగా ఉండలేని మనుషుల తత్వాలు కూసేపు కూడా ప్రతీక్షించని మనసు ఆగడాలు ప్రేమించటం కాదు మనిషి ప్రేమ పొందరా ప్రేమతోటి జీవించటం కాదు మనిషి అనుభవించరా హాయితోటి ఒక మాటైనా మాట్లాడు మంచిని పెంచేట్టు వ్యర్థపు మాటలకు కళ్లెం వెయ్యి కలిసి ఉండేట్టు |
మమకారం వెటకారం కాబోదురా
మన మమతల విలువేమిటో చూడరా
కసిగా పెరిగే కోపం విరోధాలకు నిలయం
మబ్బులా కమ్మే రోషం కలిగించదు శాంతం అన్నీ తెలుసు మనకి అంతా తెలియనిది ఎవరికీ వెర్రి కోపంలో విచక్షణ మాయమైపోతది కాసేపు ఆగాక అది సిగ్గులా పుడతాది ... సిగ్గులా పుడతాది
మనకు మనమే ఆలోచన చేస్తే అది నిగ్రహం అవుతాది .... నిగ్రహం అవుతాది
సర్వం నాశనం అంతా వినాశనం రగిలే కోపం రేగే క్రోధం అంతా క్షణికం అసూయలాగా పగ లాగా మార్చేసే భూతం ... భూతం ... భూతం - గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు |
2014 సంవత్సరంలో, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో ప్రచురించిన
రాజా చౌదరిగారి కవిత
---- 0 ----
శ్రీ రాజా చౌదరి గారి కొత్త కవిత (23-01-2017)
బురదలోకి రాయి
బురదలోకి రాయి
నువ్వేస్తేనోయి బురద చిందునోయీ నీ కంటునోయి గమ్మునుండవోయి దుష్టులకు భాయి జగడమాడకోయి అది నీకు కీడు భాయి అందరూ ఒకలా ఉండరోయి ఈ నిజాన్ని తెలుసుకోవోయి ఏనుగు గుంపు ముందు ఉండకోయి ఎలక మాదిరిలా చితుకుతావోయి నువ్వెంత వాడివైనా ఏమిటోయి మొండివాడు ముందు నువ్వు పిండే భాయి నీకు నువ్వు గొప్పేనోయి మరి వాడి సంగతి నీకు తెలియదోయి
నీకు నువ్వు గొప్పేనోయి
మరి వాడి సంగతి నీకు తెలియదోయి
|
నిన్ను నమ్మించునోయి
నీతో మంచిగుండునోయ వాడి అవసరం తీరాక నిన్ను ముంచునోయి అనవసరమైన వాదాలు ఎందుకోయి పోన్లే అని పక్కకి తప్పుకోవోయి వాడి నోరు అసలే మంచిది కాదోయి నీ మంచితనం మట్టి పాలే భాయి గుర్రపు స్వారీ సంతోషమేనోయి ఆంబోతుతో పందెం వద్దురోయి తాటాకు చప్పుళ్లు వాడి బడాయి దానికి పోటీ పడి చెయ్యకు లడాయి ఓరోరి పిల్లకాయి ఇన్ని సంగతులెందుకోయి ఒక్కటంటే ఒక్కమాట చెబుతానోయి చెడ్డవాళ్లకి దూరంగా ఉండవోయి వారి జోలికెళితే మనకే హాని భాయి |
---- 0 ----
శ్రీ రాజా చౌదరి గారికి కడప జిల్లా ప్రొద్దుటూరులో సన్మానం
-----0-----
22-01-2017 నాడు ప్రొద్దుటూరులో సన్మానం
మొన్న ఆదివారం (22.01.17) కడప జిల్లాలో ప్రొద్దుటూరు లో వేమన సాహితీ కళాపీఠం వారి అద్వర్యంలో జరిగిన ప్రధమ వార్షికోత్సవ వేడుకల్లో పొందిన చిరు సత్కారం, జ్ఞాపిక..అలానే వండర్ బుక్ ఆఫ్ రికార్ద్ సంస్థ వారు కవితా ప్రసంగాలను రికార్ద్ చేసారు .ఆ రికార్డ్ పత్రాలు కొద్ది రోజుల్లో అందుకోబడతాయి అని కళాపీఠం వారు చెప్పారు
శ్రీ రాజా చౌదరి గారికి కడప జిల్లా ప్రొద్దుటూరులో సన్మానం
-----0-----
గరిమెళ్ళ గమనాలు (రాజా చౌదరి)
-----0-----
ఇదే జీవితం ...!!
ఇదే జీవితం ... !!
ఏది సత్యం
ఏది నిత్యం
ఏది కృత్యం
ఏది నృత్యం
ఏది భావం
ఏది జాలం
ఏది రాగం
ఏది త్యాగం
ఏది పైత్యం
ఏది దౌత్యం
ఏది పంతం
ఏది శాంతం
ఏది రుద్రం
ఏది రౌద్రం
|
ఏది ధైర్యం
ఏది స్థైర్యం
ఏది లౌక్యం
ఏది సౌఖ్యం
ఏది బంధం
ఏది అందం
ఏది భోదం
ఏది బేధం
ఏది కష్టం
ఏది నష్టం
ఏది స్పష్టం
ఏది శ్రేష్టం
ఏది లక్ష్యం
ఏది సాక్ష్యం
ఏది గీత
ఏది రాత
|
ఏది భాద
ఏది గాధ
ఏది భవం
ఏది భయం
ఏది మూలం
ఏది స్థూలం
ఏది జన్మం
ఏది మర్మం
ఏది రమ్యం
ఏది ఖర్మం
ఏది సాయం
ఏది న్యాయం
ఏది ఉదయం
ఏది సమయం
ఏది అంతం
ఏది సొంతం
|
ఏది రంగం
ఏది భంగం
ఏది మౌనం
ఏది గానం
ఏది దైవం
ఏది దెయ్యం
ఏది ఖాయం
ఏది కయ్యం
ఏది నిజం
ఏది అబద్దం
ఏది జననం
ఏది మరణం
|